బీహార్ ఎన్నికల ఫలితాలు.. కేసీ వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు
- బీహార్ ఎన్నికల ఫలితాలు నమ్మశక్యంగా లేవన్న వేణుగోపాల్
- సమీక్ష తర్వాత చట్టపరంగా ముందుకు వెళతామని వ్యాఖ్య
- ఈ ఫలితాలపై ఇండియా కూటమి కలిసికట్టుగా చర్యలకు ఉపక్రమిస్తుందని వెల్లడి
బీహార్ ఎన్నికల ఫలితాలపై ఇండియా కూటమి కలిసికట్టుగా చర్యలకు ఉపక్రమిస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ విషయమై ఇప్పటికే ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌ను సంప్రదించినట్లు తెలిపారు. బీహార్‌లో ఓటమి నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ... ఖర్గే నివాసంలో సమావేశం నిర్వహించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో 19 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఈసారి 6 సీట్లకు పరిమితమైంది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్బంధన్ కేవలం 35 స్థానాలతో సరిపెట్టుకుంది. బీజేపీ-జేడీయూ నేతృత్వంలోని ఎన్డీయే 200కు పైగా స్థానాలు గెలుచుకుంది.