KC Venugopal: బీహార్ ఎన్నికల ఫలితాలు.. కేసీ వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు

KC Venugopal Comments on Bihar Election Results
  • బీహార్ ఎన్నికల ఫలితాలు నమ్మశక్యంగా లేవన్న వేణుగోపాల్
  • సమీక్ష తర్వాత చట్టపరంగా ముందుకు వెళతామని వ్యాఖ్య
  • ఈ ఫలితాలపై ఇండియా కూటమి కలిసికట్టుగా చర్యలకు ఉపక్రమిస్తుందని వెల్లడి
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితం నమ్మశక్యంగా లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. బీహార్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫలితాలను విశ్లేషించి, సమీక్షిస్తామని తెలిపారు. అనంతరం చట్టపరంగా ముందుకు వెళతామని ఆయన స్పష్టం చేశారు.

బీహార్ ఎన్నికల ఫలితాలపై ఇండియా కూటమి కలిసికట్టుగా చర్యలకు ఉపక్రమిస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ విషయమై ఇప్పటికే ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్‌ను సంప్రదించినట్లు తెలిపారు. బీహార్‌లో ఓటమి నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ... ఖర్గే నివాసంలో సమావేశం నిర్వహించారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో 19 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఈసారి 6 సీట్లకు పరిమితమైంది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాఘట్‌బంధన్ కేవలం 35 స్థానాలతో సరిపెట్టుకుంది. బీజేపీ-జేడీయూ నేతృత్వంలోని ఎన్డీయే 200కు పైగా స్థానాలు గెలుచుకుంది.
KC Venugopal
Bihar Elections
AICC
Mallikarjun Kharge
Tejaswi Yadav
RJD
India Alliance
Election Results
Bihar Assembly Elections

More Telugu News