నెల్లూరు లేడీ డాన్ అరుణ రిమాండ్ పొడిగింపు
- ఈ నెల 28 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు
- విజయవాడలో నమోదైన చీటింగ్, బెదిరింపుల కేసు
- రెండు రోజుల పాటు అరుణను విచారించిన పోలీసులు
కేసును విచారించిన న్యాయమూర్తి, ఆమె రిమాండ్‌ను మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పోలీసులు ఆమెను తిరిగి జైలుకు తరలించారు. చీటింగ్, బెదిరింపుల ఆరోపణలతో ఆమె అరెస్ట్ కావడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.