Pawan Kalyan: ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురం... అధికారులకు పవన్ కల్యాణ్ ఆదేశాలు

Pawan Kalyan Focuses on Pithapuram as Spiritual Tourism Hub
  • 19 ఆలయాల అభివృద్ధికి రూ.20కోట్లు మంజూరు చేస్తానన్న పవన్ కల్యాణ్
  • ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దాలన్న పవన్ 
  • జీర్ణావస్థలోని ఆలయాలకు పునరుజ్జీవం కల్పించనున్నట్టు వెల్లడి
తన నియోజకవర్గమైన పిఠాపురాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు వేగవంతం చేసినట్టు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఇందులో భాగంగా పిఠాపురంలోని 19 ఆలయాల అభివృద్ధికి దేవాదాయ శాఖ కామన్ గుడ్ ఫండ్ (సీజీఎఫ్) నుంచి రూ.20 కోట్లు మంజూరు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు.
 
పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ, దేవాదాయ శాఖ అధికారులతో నిన్న పవన్ కల్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శక్తిపీఠం శ్రీ పురూహూతిక అమ్మవారు, శ్రీ కుక్కుటేశ్వర స్వామి, శ్రీపాద శ్రీవల్లభ పీఠం వంటి ప్రఖ్యాత ఆలయాలున్న పిఠాపురాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే పనులు వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని అధికారులను ఆదేశించారు.
 
నియోజకవర్గంలో జీర్ణావస్థకు చేరిన ఆలయాలను గుర్తించామని, వాటికి పునరుజ్జీవం కల్పించేందుకు అవసరమైన నిధులను దేవాదాయ శాఖ సమకూరుస్తుందని పవన్ వివరించారు. 19 ఆలయాల అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు చేసేందుకు దేవాదాయ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించిందని, మ్యాచింగ్ గ్రాంట్‌తో ఈ నిధులను కేటాయిస్తారని తెలిపారు. ఆలయాల సమగ్ర అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధమయ్యాయని ఆయన పేర్కొన్నారు.
Pawan Kalyan
Pithapuram
Spiritual Tourism
Temple Development
Andhra Pradesh
Devadaya Department
Common Good Fund
Puruhutika Ammavaru
Kukkuteswara Swamy
Sripada Srivallabha Peetham

More Telugu News