జూబ్లీహిల్స్ కౌంటింగ్... మూడో రౌండ్‌లో కూడా కాంగ్రెస్ ఆధిక్యత
- కొనసాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు
- మూడు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ ముందంజ
- మూడో రౌండ్‌లో కాంగ్రెస్ కు 11,082 ఓట్లు
ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో తొలి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కనబరుస్తోంది. మూడో రౌండ్‌లో కాంగ్రెస్‌కు 11,082 ఓట్లు, బీఆర్ఎస్‌కు 8,083 ఓట్లు రాగా, బీజేపీకి 1,866 ఓట్లు వచ్చాయి. మూడో రౌండ్‌లో భాగంగా రెహమత్ నగర్, ఎర్రగడ్డ, వెంగళ్‌రావు నగర్ డివిజన్ల పరిధిలోని ఓట్లను అధికారులు లెక్కించారు.