Tej Pratap Yadav: మహువాలో తేజ్ ప్రతాప్.. రాఘోపూర్‌లో తేజస్వీయాదవ్ ముందంజ

Tej Pratap Yadav Leads in Mahua Tejaswi Yadav Ahead in Raghopur
   
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం అధికార ఎన్డీయే అభ్యర్థులు 50 స్థానాల్లో ముందంజలో ఉండగా, 23 స్థానాల్లో మహాఘట్‌బంధన్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. .ఇక రాఘోపూర్‌లో ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ ముందంజలో కొనసాగుతుండగా, మహువాలో ఆయన సోదరుడు, జనశక్తి జనతా దళ్ అధ్యక్షుడు తేజ్ ప్రతాప్ ముందంజలో ఉన్నారు. 

కాగా, బీహార్ ఎన్నికల అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌ అన్నీ ఎన్డీయే కూటమి మరోమారు అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్‌బంధన్ 90 నుంచి100 స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేశాయి. ప్రస్తుతం ట్రెండ్స్ చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి.
Tej Pratap Yadav
Bihar Election Results
Tejashwi Yadav
Mahua
Raghopur
Bihar Assembly Elections
NDA
Mahagathbandhan

More Telugu News