Al-Falah University: ఢిల్లీ కారు బాంబు పేలుడు.. ఆల్ ఫలాహ్ యూనివర్సిటీ సభ్యత్వం రద్దు!

Al Falah University membership cancelled after Delhi car bomb blast
  • సభ్యత్వం రద్దు చేస్తున్నట్లు తెలిపిన అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్
  • ఏఐయూ లోగోను తొలగించాలని విశ్వవిద్యాలయానికి ఆదేశాలు
  • ఏఐయూ పేరును లేదా లోగోను ఉపయోగించకూడదని స్పష్టీకరణ
అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ) అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయ సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో ఈ విశ్వవిద్యాలయానికి చెందిన పలువురు అధ్యాపకులు అనుమానితులుగా ఉండటంతో ఏఐయూ ఈ చర్య తీసుకుంది. ఏఐయూ లోగోను తొలగించాలని కూడా విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. ఏఐయూ పేరును లేదా లోగోను ఏ రూపంలోనూ ఉపయోగించవద్దని స్పష్టం చేసింది.

విశ్వవిద్యాలయ తీరు సరిగా లేనందున సభ్యత్వం రద్దు చేసినట్లు ఏఐయూ వెల్లడించింది. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ నిబంధనల మేరకు నడుచుకున్నంత వరకు మాత్రమే విశ్వవిద్యాలయాలను ఏఐయూ సభ్యులుగా పరిగణిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. ఏఐయూ నిబంధనలు ఉల్లంఘించినట్లుగా కనిపిస్తున్నందున అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేసినట్లు వెల్లడించింది.

హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో గల అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం ఇక నుంచి ఏఐయూ పేరును లేదా లోగోను ఉపయోగించరాదని, ఆ విశ్వవిద్యాలయం తన అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా ఈ లోగోను తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
Al-Falah University
Delhi car bomb blast
Association of Indian Universities
AIU
Faridabad

More Telugu News