Chandramukhi: 'చంద్రముఖి' విషయంలో అలా జరిగిందట!

Vidyasagar Interview
  • 2005లో విడుదలైన 'చంద్రముఖి'
  • మ్యూజికల్ హిట్ గా నిలిచిన సినిమా
  • రజనీ గురించి ప్రస్తావించిన విద్యాసాగర్ 
  • 'రా రా' పాట ఒక రేంజ్ లో దూసుకెళ్లిందని వ్యాఖ్య  

'చంద్రముఖి' .. రజనీకాంత్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమా. జ్యోతిక .. నయనతార .. ప్రభు ముఖ్యమైన పాత్రలను పోషించారు. పి.వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా, 2005లో థియేటర్లకు వచ్చింది. కథాకథనాల పరంగా .. సంగీతం పరంగా ప్రశంసలను అందుకుంది. ఈ సినిమాను ఇప్పటికీ ఎవరూ మరిచిపోకపోవడం విశేషం. అలాంటి ఈ సినిమాను గురించి, రీసెంటుగా 'ఐ డ్రీమ్' వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంగీత దర్శకుడు విద్యాసాగర్ ప్రస్తావించారు.

"సంగీత దర్శకుడిగా 35 ఏళ్లుగా నా ప్రయాణం కొనసాగుతూ వచ్చింది. అయితే ఈ సుదీర్ఘమైన నా ప్రయాణంలో రజనీకాంత్ గారితో కలిసి ఒకే ఒక్క సినిమాకు పనిచేశాను. ఆ సినిమా పేరే 'చంద్రముఖి'. ఈ సినిమా మ్యూజిక్ సిటింగ్స్ లో మొదటి రోజున రజనీకాంత్ గారు వచ్చారు. ఈ సినిమాలో రెండు పాటలు తప్పకుండా హిట్ కావాలని రజనీ సార్ అన్నారు. 'ఐదు పాటలు హిట్ చేద్దాం సార్' అన్నాను నేను.

"నేను ఆ మాట అనగానే రజనీ సార్ నా వైపు ఒకలా చూశారు. నేను చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడానని ఆయన అనుకున్నారేమో. ఐదు పాటలు హిట్ చేసి పెట్టమని నేను దేవుడిని కోరుకున్నాను. సినిమా రిలీజ్ తరువాత అన్ని పాటలు హిట్ అనే టాక్ వచ్చింది. రజనీ సార్ చాలా హ్యాపీగా ఫీలయ్యారు. 200 రోజుల వేడుక సమయంలో స్టేజ్ పై ఆయన నా గురించి చెప్పారు. 'రా రా' అనే పాట, తమిళనాడు అంతటా మారుమ్రోగిన ఏకైక తెలుగు పాటగా నిలిచింది" అని చెప్పారు. 

Chandramukhi
Rajinikanth
Vidyasagar
Jyothika
Nayanthara
P Vasu
Tamil cinema
Telugu song
Ra Ra song
Chandramukhi movie

More Telugu News