AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావు, కృష్ణకిశోర్‌కు ప్రవీణ్ ప్రకాశ్ బహిరంగ క్షమాపణ

Praveen Prakash Apologizes to AB Venkateswara Rao Krishna Kishore
  • గత ప్రభుత్వంలో తన తీరుపై పశ్చాత్తాపం వ్యక్తం చేసిన ప్రవీణ్ ప్రకాశ్
  • సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి
  • వారి పట్ల అనుచితంగా ప్రవర్తించానని అంగీకారం
వైసీపీ ప్రభుత్వ హయాంలో తాను వ్యవహరించిన తీరుపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిశోర్‌కు ఆయన బహిరంగ క్షమాపణలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. గత ప్రభుత్వంలో సర్వీసులో ఉండగా వారి పట్ల తాను అనుచితంగా ప్రవర్తించానని, అందుకు ఇప్పుడు చింతిస్తున్నానని పేర్కొన్నారు.

గతేడాది తనపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరిగిందని ప్రవీణ్ ప్రకాశ్ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తన ప్రవర్తన గురించి పునరాలోచించుకున్నానని, తాను చేసింది తప్పని గ్రహించానని వివరించారు. ఈ నేపథ్యంలోనే తాను బాధపెట్టిన అధికారులకు క్షమాపణ చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తన చర్యల వల్ల ఇబ్బందిపడిన ఏబీ వెంకటేశ్వరరావు, జాస్తి కృష్ణకిశోర్‌ను క్షమించమని కోరారు.

అదే సమయంలో, తన 30 ఏళ్ల సర్వీసులో ఎన్నడూ అవినీతికి పాల్పడలేదని ప్రవీణ్ ప్రకాశ్ స్పష్టం చేశారు. కేవలం కొందరు వ్యక్తుల పట్ల తన ప్రవర్తన సరిగా లేదని అంగీకరించారు. 
AB Venkateswara Rao
Praveen Prakash
Krishna Kishore
IAS officer
IRS officer
AP government
YS Jagan
Apology
Andhra Pradesh
retired officers

More Telugu News