Turkey military plane crash: అజర్‌బైజాన్-జార్జియా సరిహద్దులో కూలిపోయిన టర్కీ సైనిక విమానం.. ఇదిగో వీడియో

Turkey Military Plane Crashes on Azerbaijan Georgia Border
  • గింగిర్లు తిరుగుతూ కిందపడిపోయిన సీ-130 విమానం
  • అజర్‌బైజాన్ నుండి బయలుదేరి టర్కీ వెళుతుండగా ప్రమాదం
  • కొనసాగుతున్న సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్
టర్కీకి చెందిన సైనిక కార్గో విమానం అజర్‌బైజాన్-జార్జియా సరిహద్దు సమీపంలో కుప్పకూలిందని టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపినట్లు అసోసియేటెడ్ ప్రెస్ పేర్కొంది. సీ-130 విమానం అజర్‌బైజాన్ నుంచి టర్కీకి ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు టర్కీ ప్రభుత్వం వెల్లడించింది. విమానంలో ఎంతమంది సిబ్బంది ఉన్నారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

అజర్‌బైజాన్, జార్జియా దేశాల ఉన్నతాధికారుల సహకారంతో గాలింపు, సహాయక చర్యలు ప్రారంభించినట్లు టర్కీ ప్రకటించింది.

టర్కీ సాయుధ దళాలు సాధారణంగా సైనికులను, సైనిక సామగ్రిని తరలించడానికి సీ-130 విమానాలను వినియోగిస్తాయి. టర్కీ ప్రైవేటు బ్రాడ్‌కాస్టర్ ఎన్-టీవీ, ఇతర మీడియా సంస్థలు ప్రసారం చేసిన వీడియో ఫుటేజీలలో విమానం గింగిర్లు తిరుగుతూ కిందకు పడిపోతున్నట్లుగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో తెల్లని పొగలు కూడా కనిపించాయి.
Turkey military plane crash
Azerbaijan
Georgia
C-130 plane
Military cargo plane

More Telugu News