Rekha Gupta: కారు బాంబు పేలుడు.. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా

Rekha Gupta announces Rs 10 lakh ex gratia for car bomb blast victims
  • కారు బాంబు పేలుడులో 13 మంది మృతి
  • శాశ్వత అంగవైకల్యం కలిగిన వారికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా
  • బాధితులకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి హామీ
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో బాధిత కుటుంబాలకు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ పేలుడులో 13 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.

ఈ మేరకు ముఖ్యమంత్రి మాట్లాడుతూ, శాశ్వత అంగవైకల్యం కలిగిన వారికి రూ. 5 లక్షలు, క్షతగాత్రులకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపారు. బాధితులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. ఈ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా సంతాపం తెలియజేశారు.
Rekha Gupta
Delhi car bomb blast
Red Fort blast
Delhi CM
Ex gratia
Delhi government

More Telugu News