Jubilee Hills Bypoll: ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్.. క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం

Jubilee Hills Bypoll Polling Concludes Voting Opportunity for Those in Line
  • మాగంటి గోపీనాథ్ అకాల మృతితో ఉప ఎన్నిక
  • ఈ నెల 14న ఓట్ల లెక్కింపు
  • జూబ్లీహిల్స్ బరిలో 58 మంది అభ్యర్థులు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. పోలింగ్ కేంద్రాల వద్ద గేట్లు మూసివేశారు. సాయంత్రం ఆరు గంటల వరకు క్యూ లైన్‌లో ఉన్న ఓటర్లకు ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. 2023లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 14న జరగనుంది.

జూబ్లీహిల్స్‌ బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు నిలిచారు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు. గెలుపుపై ఆయా పార్టీల అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Jubilee Hills Bypoll
Telangana Bypoll
Maganti Gopinath
Maganti Sunitha
Naveen Yadav

More Telugu News