భారీ పేలుడుతో ఢిల్లీలో హైఅలర్ట్... సెలవు కావడంతో తగ్గిన ప్రమాద తీవ్రత

  • ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు
  • ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్ఏఐ, ఎన్ఎస్‌జీ
  • మార్కెట్లకు సెలవు కావడంతో తగ్గిన ప్రమాద తీవ్రత
ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో భారీ పేలుడు సంభవించడంతో ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించారు. నగర వ్యాప్తంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ 1 వద్ద పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన కారులో ఈ పేలుడు సంభవించింది. 8 మంది మరణించారు.

మారుతీ ఎకో కారులో పేలుడు జరిగినట్లు సమాచారం. వెంటనే ఎన్ఏఐ, ఎన్ఎస్‌జీ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

కారులో ఉంచిన పేలుడు పదార్థాలను రిమోట్ కంట్రోల్ ద్వారా పేల్చి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం కావడంతో ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లకు సెలవు ఉంది. అందువల్ల ప్రమాద తీవ్రత తక్కువగా ఉందని స్థానికులు భావిస్తున్నారు. ఎర్రకోట సమీపంలోని మెట్రో రైలు వద్ద పేలుడు సంభవించడంతో పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.



More Telugu News