ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో సమీపంలో భారీ పేలుడు... 8 మంది మృతి
- ఎర్రకోట మెట్రో రైలు స్టేషన్ సమీపంలో ఒక కారులో పేలుడు
- పలు వాహనాలకు అంటుకున్న మంటలు
- ఎనిమిది మంది మృతి, పలువురికి గాయాలు
- ఎనిమిది కార్లు ధ్వంసం
గేట్ నెంబర్-1 సమీపంలో పార్కింగ్ చేసిన కారులో సాయంత్రం 6.45 నిమిషాలకు పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంది.
ఏడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇది ఉగ్రవాద చర్యనా? లేక ప్రమాదవశాత్తు జరిగిందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.