బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర ఆరోగ్యంపై వార్తలను ఖండించిన నటుడి టీమ్
- ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో వెంటిలెటర్ మీద ఉన్నారని వార్తలు
- ఆరోగ్యంగానే ఉన్నారని, ఆందోళన అవసరం లేదన్న నటుడి టీమ్
- ధర్మేంద్ర ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఖండించిన సన్నీ డియోల్ బృందం
శ్వాస సంబంధిత సమస్యతో ధర్మేంద్ర అక్టోబర్ 31న ఆసుపత్రికి వెళ్లారు. మరోసారి ఆయన ఆసుపత్రికి వెళ్లడంతో ఆయన ఆరోగ్యంపై పుకార్లు వచ్చాయి. ధర్మేంద్ర 89 ఏళ్ల వయస్సులోనూ నటిస్తుండటం విశేషమని, డిసెంబర్ 9న ఆయన 90వ వసంతంలోకి అడుగు పెడుతున్నారని ఆయన బృందం తెలిపింది.
ఈ ప్రచారాన్ని ఆయన కుమారుడు సన్నీడియోల్ బృందం కూడా తోసిపుచ్చింది. ధర్మేంద్ర కోలుకుంటున్నారని తెలిపింది. ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని పేర్కొంది.
ఇదిలా ఉండగా, డిసెంబర్ 25న ఆయన కీలక పాత్ర పోషించిన 'ఇక్కీస్' విడుదల కానుంది. చిన్న వయస్సులోనే పరమవీర చక్ర పురస్కారాన్ని అందుకున్న సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్‌పాల్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఇది. ధర్మేంద్ర ఇందులో అరుణ్ తండ్రిగా నటిస్తున్నారు.