Chandrababu: మంత్రులకు సీఎం చంద్రబాబు కితాబు.. కార‌ణ‌మిదే!

Chandrababu Praises Ministers for Cyclone Relief Efforts
  • సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ సమావేశం
  • 'మొంథా' తుపాను సహాయక చర్యలపై మంత్రులకు సీఎం అభినందనలు
  • క్షేత్రస్థాయిలో సమర్థంగా పనిచేశారంటూ ప్రశంసలు
  • లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం
  • కొత్త క్వాంటం కంప్యూటింగ్, డ్రోన్ సిటీ పాలసీలకు గ్రీన్ సిగ్నల్
  • విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సుపై ప్రధానంగా చర్చ
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా ఇటీవల సంభవించిన 'మొంథా' తుపాను సమయంలో క్షేత్రస్థాయిలో అద్భుతంగా పనిచేశారంటూ ముఖ్యమంత్రి తన కేబినెట్ సహచరులను ప్రత్యేకంగా అభినందించారు. మంత్రులంతా క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, తక్షణ సహాయక చర్యలు అందేలా చూడటం వల్లే మంచి ఫలితాలు వచ్చాయని చంద్రబాబు అన్నారు.

గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం పూర్తి సమన్వయంతో పనిచేయడం వల్లే తుపాను నష్టాన్ని తగ్గించగలిగామని తెలిపారు. ఆర్టీజీ సెంటర్ ద్వారా నిరంతరం పర్యవేక్షించడం, ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోవడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా నివారించగలిగామని ఆయన వివరించారు. మంత్రులు, అధికారులు టీం స్పిరిట్‌తో పనిచేస్తే ఇలాంటి మంచి ఫలితాలే వస్తాయని పేర్కొన్నారు.

ఈ కేబినెట్ సమావేశంలో మొత్తం 70 అంశాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. మొంథా తుపాను ప్రభావం, నష్టం అంచనాలు, బాధితులకు అందించే పరిహారంపై కూడా ప్రధానంగా చర్చించనున్నారు.

విశాఖలో జరగనున్న పెట్టుబడుల సదస్సుపై స‌మీక్ష‌
వీటితో పాటు ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న పెట్టుబడుల సదస్సు నిర్వహణపై సమీక్షించనున్నారు. అలాగే రాష్ట్రంలో టెక్నాలజీ అభివృద్ధికి ఊతమిచ్చే 'క్వాంటం కంప్యూటింగ్ పాలసీ 2025-30'కి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ప్రతిపాదిత డ్రోన్ సిటీలో భూమి కేటాయింపులకు సంబంధించిన పాలసీకి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.
Chandrababu
Andhra Pradesh
Cyclone Montha
AP Cabinet Meeting
Investment Summit Visakhapatnam
Quantum Computing Policy
Drone City
AP Politics
Disaster Management
Relief Measures

More Telugu News