బిగ్ బాస్ హౌస్‌లో ఊహించని ట్విస్ట్.. స్వయంగా వైదొలిగిన రాము
- స్వచ్ఛందంగా షో నుంచి వైదొలిగిన రాము రాథోడ్
- కుటుంబ సభ్యులు గుర్తొస్తున్నారంటూ భావోద్వేగం
- వెళ్లేందుకు అవకాశం కల్పించిన హోస్ట్ నాగార్జున
- ఓటింగ్‌లో చివరి స్థానంలో ఉన్న సాయి శ్రీనివాస్
- రాము ఎలిమినేషన్‌తో సాయి సేఫ్ అయ్యే అవకాశం
ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. 9వ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఉత్కంఠగా సాగుతున్న తరుణంలో, కంటెస్టెంట్ రాము రాథోడ్ స్వచ్ఛందంగా షో నుంచి వైదొలిగారు. ఈ వారం అత్యల్ప ఓట్లు పోలైన సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అవుతాడని అందరూ భావిస్తున్న సమయంలో రాము నిష్క్రమణ పెద్ద ట్విస్ట్‌గా మారింది.
గత కొన్ని వారాలుగా రాము ఆటలో చురుకుగా పాల్గొనడం లేదు. నామినేషన్లలో వాదనలకు దిగకుండా, తానే వెళ్ళిపోతానంటూ డల్‌గా ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కుటుంబ సభ్యులు గుర్తొస్తున్నారా అని అడగ్గా, రాము తనదైన శైలిలో పాట రూపంలో సమాధానమిచ్చాడు. 'బాధయితోందే యాదిలో మనసంతా.. మస్తు బరువైతోందే అమ్మ యాదిలో మనసంతా' అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.
"చిన్నప్పుడు మా అమ్మానాన్న పని కోసం వేరే ఊరికి వెళ్లారు. దాదాపు 5-6 ఏళ్లు వారికి దూరంగా ఉన్నాను. ఇప్పుడు జీవితంలో అంతా కుదురుకుంది. వారిని చూసుకుందామనుకునే సమయంలో మళ్లీ ఇన్ని రోజులు దూరంగా ఉన్నాను" అని రాము తన ఆవేదనను వ్యక్తం చేశాడు. అతని మానసిక పరిస్థితిని అర్థం చేసుకున్న నాగార్జున, బిగ్ బాస్ గేట్లు తెరవాలని ఆదేశించారు. బయటకు వెళ్లే అవకాశం ఇవ్వగా, "వెళ్తాను సర్" అని రాము చెప్పడంతో అతని ప్రయాణం ముగిసింది.
ప్రస్తుతం 9వ వారం నామినేషన్స్‌లో సంజన, సుమన్ శెట్టి, భరణి, కల్యాణ్, రాము, సాయి శ్రీనివాస్, తనూజ ఉన్నారు. శుక్రవారం రాత్రితో ముగిసిన ఓటింగ్ ప్రకారం సాయి శ్రీనివాస్ చివరి స్థానంలో నిలిచాడు. అయితే, రాము సెల్ఫ్ ఎలిమినేట్ కావడంతో ఈ వారం మరొక ఎలిమినేషన్ ఉంటుందా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. చాలావరకు రాము నిష్క్రమణతో ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసే అవకాశం ఉందని, దీంతో సాయి శ్రీనివాస్ సేఫ్ అయినట్లేనని తెలుస్తోంది.