Jaggareddy: బెంజ్ కారులో తిరిగే స్థోమత ఉన్నా నేను గంజికే కనెక్ట్ అయ్యాను: జగ్గారెడ్డి

Jaggareddy I am still connected to ganji despite owning a Benz car
  • సంగారెడ్డిలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న జగ్గారెడ్డి
  • మిత్రులతో సరదాగా మాట్లాడిన జగ్గారెడ్డి
  • గంజి తాగి బతికిన వాళ్లు బెంజ్‌లో తిరిగినప్పటికీ గతాన్ని మరిచిపోవద్దని వ్యాఖ్య
బెంజ్ కారులో తిరిగే స్థోమత ఉన్నప్పటికీ తాను గంజికే కనెక్ట్ అయిన వ్యక్తినని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఒకప్పుడు గంజి తాగిన వాళ్లు ఆ తర్వాత కారులో తిరుగుతూ తాము గతంలో గడిపిన జీవితాన్ని మరిచిపోతున్నారని ఆయన అన్నారు.

శనివారం సంగారెడ్డిలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన మిత్రులతో సరదాగా మాట్లాడుతూ, దేశం, రాష్ట్రంలో ఇది పెద్ద సమస్యగా మారిందని ఆయన అన్నారు. గంజి తాగి బతికిన వాళ్లు బెంజ్‌లో తిరిగినప్పటికీ గతాన్ని మరిచిపోకూడదని ఆయన అన్నారు.
Jaggareddy
TPCC
Telangana Congress
Ganja
Sangareddy
Benz Car
Poverty
Social Issues

More Telugu News