భానుప్రియ సంపాదనంతా అలా పోయిందట!
- భానుప్రియ గొప్ప నటి
- తన ఆస్తులను తల్లికే వదిలేసిన వైనం
- ఆదర్శ్ కౌశల్ తో ఆమె వివాహం
- మనస్పర్ధలతో తిరిగొచ్చిన తీరు
- మెమరీ లాస్ నుంచి బయటపడిన భానుప్రియ
తెలుగు తెరపై శాస్త్రీయ నాట్యమైనా .. మోడ్రన్ డాన్స్ అయినా అద్భుతంగా చేయగలిగిన కథానాయికగా ఒకప్పుడు భానుప్రియ గురించి చెప్పుకునేవారు. నయనాలతో .. నాట్యంతో ఆమె చేసే విన్యాసం చూడటానికి అభిమానులు తప్పకుండా ఆమె సినిమాలకు వెళ్లేవారు. ఇక భానుప్రియ వాయిస్ కూడా చాలా ప్రత్యేకమేనని చెప్పాలి. ఇలా అనేక కోణాల్లో ప్రతిభ కలిగిన నాయికగా మనకి భానుప్రియ కనిపిస్తారు.
అలాంటి భానుప్రియ గురించి 'ట్రీ మీడియా'వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు నందం హరిశ్చంద్రరావు ప్రస్తావించారు. " భానుప్రియను చూసి ఆదర్శ్ కౌశల్ ఇష్టపడ్డారు .. ఆయన ప్రపోజల్ ను ఆమె అంగీకరించారు. అయితే ఆ పెళ్లికి భానుప్రియ తల్లి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తల్లి స్వార్థంతో ఆలోచింస్తుందని గ్రహించిన భానుప్రియ, అప్పటివరకూ తాను సంపాదించిన ఆస్తిపాస్తులను అలా తల్లికే వదిలేసి అమెరికా వెళ్లిపోయారు. అక్కడే ఆదర్శ్ కౌశల్ ను వివాహం చేసుకున్నారు" అని అన్నారు.
"భానుప్రియ గారి వ్యక్తిత్వం గొప్పది. అత్తగారి పట్ల గౌరవం .. భర్త పట్ల ప్రేమ ఉండేవి. తనకాళ్లపై తాను నిలబడటం కోసం, అమెరికాలో డాన్స్ స్కూల్ ఓపెన్ చేశారు. అయితే అత్తగారు చనిపోయిన తరువాత, ఆ భార్యాభర్తల మధ్య గొడవలు పెరుగుతూ వచ్చాయి. అందుకు కారణం ఆయన వ్యసనాల బారిన పడటమే. ఇక భరించలేని పరిస్థితులలో ఆమె చెన్నైకి తిరిగి వచ్చారు. భర్త వైపు నుంచి కూడా ఆమెకి ఎలాంటి ఆస్తిపాస్తులు రాలేదు. ఆ మధ్య మెమరీ లాస్ తో బాధపడిన భానుప్రియగారు, ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి బయటపడ్డారు" అని చెప్పారు.