Rahul Gandhi: చేపల వేట కోసం చెరువులోకి దిగిన రాహుల్ గాంధీ.. ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు

Rahul Gandhi fishes in pond Modi fires satire
  • బెగుసరాయ్ జిల్లాలో మత్స్యకారులతో కలిసి చెరువులోకి దిగిన రాహుల్ గాంధీ
  • మత్స్యకారులతో కలిసి చేపలు పట్టి, అనంతరం సరదాగా ఈత కొట్టిన అగ్రనేత
  • ఎన్నికల్లో మునిగిపోవడానికి ప్రాక్టీస్ చేస్తున్నారని ప్రధాని చురక
కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకచోట మత్స్యకారులతో కలిసి చెరువులోకి దిగడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. బీహార్ చేపలను చూడటానికి పెద్దపెద్దవారు వస్తున్నారని, ఎన్నికల్లో మునిగిపోవడానికి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఇటీవల బెగుసరాయ్ జిల్లాలో మత్స్యకారులతో కలిసి రాహుల్ గాంధీ చేపలు పట్టేందుకు వెళ్లారు. ఆయన వెంట మాజీ మంత్రి, వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ వ్యవస్థాపకుడు, ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి ముకేశ్ సాహ్నీ కూడా ఉన్నారు. చేపలు పట్టేందుకు సాహ్నీ నీళ్లలోకి దిగి వల వేశారు. కాసేపటికి రాహుల్ గాంధీ కూడా నీళ్లలోకి దిగి మత్స్యకారులతో కలిసి చేపలు పట్టారు. సరదాగా ఈత కొట్టారు.

ఈ సందర్భంగా జాలర్లతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వారికి పలు హామీలు గుప్పించారు. వేట నిషేధిత కాలంలో మత్స్యకారుల కుటుంబాలకు రూ. 5 వేల చొప్పున ఆర్థిక సాయం, బీమా సదుపాయం, చేపల మార్కెట్ల ఏర్పాటు, మత్స్య సంపద కోసం జలవనరుల పునరుద్ధరణ వంటి హామీలు ఇచ్చారు.
Rahul Gandhi
Bihar Elections
Narendra Modi
Fishermen
Mukesh Sahani
Congress
Fishing
Beekeeping
Indian Politics

More Telugu News