‘ఆహా’ లో కె–ర్యాంప్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!
- ఓటీటీ విడుదలపై అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ
- థియేటర్లలో విడుదలై మాస్ ఆడియన్స్ ను మెప్పించిన కె–ర్యాంప్
- సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన పాటలు
జైన్స్ నాని దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా, నరేష్ వీకే, సాయికుమార్, కామ్నా జెఠ్మలానీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ‘ఆహా’ లో ఈ నెల 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని కె–ర్యాంప్ నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.