Panchumarthi Anuradha: మీకు ఇంకా బుద్ధి రాలేదా: జగన్ పై అనురాధ ఫైర్

Panchumarthi Anuradha Fires at Jagan Mohan Reddy
  • జగన్ పేటీఎం బ్యాచ్ మూల్యం చెల్లించుకోక తప్పదని అనురాధ హెచ్చరిక
  • తల్లి, చెల్లిని కూడా జగన్ వదల్లేదని తీవ్ర విమర్శ
  • అనుచిత పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్
వైసీపీ అధినేత జగన్, ఆయన సోషల్ మీడియా వర్గాలపై శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ పెంచి పోషిస్తున్న 'పేటీఎం బ్యాచ్' తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆమె గట్టిగా హెచ్చరించారు. సొంత తల్లిని, చెల్లిని కూడా వదలకుండా వ్యక్తిత్వ హననానికి పాల్పడిన దుర్మార్గుడు జగన్ అని అనురాధ విమర్శించారు.

కల్తీ మద్యంతో రాష్ట్రంలో 30 వేల మంది ప్రాణాలు తీసి, ఎందరో తల్లులకు కడుపుకోత మిగిల్చారని ఆమె మండిపడ్డారు. సోషల్ మీడియాలో యువతతో తప్పుడు పోస్టులు పెట్టించి, వారిని జైలు పాలు చేస్తూ తల్లిదండ్రులకు ఆవేదన మిగులుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలతో జగన్ చేయిస్తున్న ఇలాంటి వికృత చేష్టల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భాస్కర్ రెడ్డి లాంటి వారిని ఎంతమందిని ప్రయోగించినా, వారంతా కటకటాల వెనక్కి వెళ్లడం ఖాయమన్నారు.

తలా తోక లేని వ్యాఖ్యలతో మహిళలను కించపరిచే వారు అసలు మనుషులేనా అని ఆమె నిలదీశారు. "పనికిమాలిన పేటీఎం బ్యాచ్‌తో ఇంకెంత కాలం విషప్రచారం సాగిస్తారు? ప్రజలు 11 సీట్లు ఇచ్చినా మీకు ఇంకా బుద్ధి రాలేదా?" అని ప్రశ్నించారు.

Panchumarthi Anuradha
YS Jagan
YSRCP
Andhra Pradesh Politics
TDP
Social Media Trolls
Fake News
Liquor Deaths
Paytm Batch
भाസ്కర్ రెడ్డి

More Telugu News