చెప్పడానికి ఎలాంటి సమాచారం లేదు: ట్రంప్ భారత పర్యటనపై కేంద్రం స్పందన

  • వచ్చే ఏడాది భారత్‌ను ట్రంప్ సందర్శించవచ్చని నివేదికలు
  • తమ వద్ద ఎటువంటి సమాచారం లేదన్న విదేశాంగ మంత్రిత్వ శాఖ
  • ట్రంప్ పర్యటన వివరాలు తెలిసినప్పుడు పంచుకుంటానన్న రణధీర్ జైస్వాల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది భారతదేశాన్ని సందర్శించవచ్చనే వార్తలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ విషయమై తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేసింది.

విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ట్రంప్ భారత పర్యటనకు వస్తారన్న ప్రకటనపై తమకు సమాచారం లేదన్నారు. ఒకవేళ వివరాలు తెలిస్తే మీడియాకు తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు.

శ్వేతసౌధంలో విలేకరులతో ట్రంప్ మాట్లాడుతూ, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో చర్చలు బాగా జరుగుతున్నాయని చెప్పారు. త్వరలోనే భారత్‌లో పర్యటించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించిందని అన్నారు. మోదీ తన స్నేహితుడని, ఇద్దరం ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటున్నామని ఆయన వెల్లడించారు. భారత్‌లో పర్యటించాలని మోదీ తనను ఆహ్వానించారని, త్వరలోనే పర్యటన తేదీని ఖరారు చేస్తామని ట్రంప్ తెలిపారు. మోదీ గొప్ప వ్యక్తి అని ఆయన కొనియాడారు. తప్పకుండా తాను భారత్‌కు వెళతానని ట్రంప్ స్పష్టం చేశారు..


More Telugu News