రేవంత్ రెడ్డిపై వ్యాఖ్యలు.. బండి సంజయ్‌పై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
- పీసీసీ ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఈసీకి ఫిర్యాదు
- బండి సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
- నిన్న జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా బండి సంజయ్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి మాట్లాడారని కాంగ్రెస్ పేర్కొంది. ఈ మేరకు పీసీసీ ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు అందజేసింది.
నిన్న జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్, ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే తులం బంగారం ఇవ్వడమేమో కానీ, ప్రజల వద్ద ఉన్న బంగారాన్ని కూడా గుంజుకుంటారని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఎన్నో అవినీతి ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక కేసీఆర్ కుటుంబాన్ని ఒక్క కేసులో కూడా ఎందుకు జైల్లో పెట్టలేదని ప్రశ్నించారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.