మార్కెట్లో షారూఖ్ చెన్నై ఎక్స్ ప్రెస్ ఫస్ట్ లుక్
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ముంబైలో చెన్నైఎక్స్ ప్రెస్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దీపికపై కింగ్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించారు. దీపిక అద్భుతంగా నటించిందన్నాడు. ఈమధ్య కాలంలో రెండు మూడు సినిమాల్లో దీపిక నటన చాలా బాగుందని ఆకాశానికెత్తేశాడు. దీపికా పదుకునే సినీరంగ ప్రవేశం షారూఖ్ తోనే జరిగింది. దీపిక కూడా తక్కువ తినలేదు. షారూఖ్ ను తెగపొగిడేసింది. షారూఖ్ ఖాన్, దీపికా పదుకునే జంటగా నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ కి రోహిత్ శెట్టి దర్శకత్వం వహించారు.