Sreeleela: వరంగల్‌లో సందడి చేసిన సినీ నటి శ్రీలీల

Sreeleela Attends Shopping Mall Opening in Warangal
  • ఓరుగల్లులోని రైల్వే స్టేషన్ రోడ్డులో ఏర్పాటు చేసిన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరైన శ్రీలీల
  • జ్యోతి ప్రజ్వలన చేసి వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన శ్రీలీల
  • సరికొత్త డిజైన్లను ఆవిష్కరించిన శ్రీలీల
ప్రముఖ సినీ నటి శ్రీలీల తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌లో సందడి చేశారు. నగరంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు.

అనంతరం షాపింగ్ మాల్‌లో సరికొత్త డిజైన్‌లను ఆమె ఆవిష్కరించారు. శ్రీలీలను చూసేందుకు అధిక సంఖ్యలో సినీ అభిమానులు, ప్రజలు షాపింగ్ మాల్ వద్దకు తరలి వచ్చారు. అభిమానులు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపించారు. కొందరు అభిమానులతో ఆమె సెల్ఫీలు దిగి వారిని సంతోషపరిచారు.
Sreeleela
Sreeleela Warangal
Warangal
Telangana
Shopping Mall
Movie Actress
Tollywood

More Telugu News