నా కాన్వాయ్‌పై చెప్పులు, పేడ విసిరారు: బీహార్ ఉప ముఖ్యమంత్రి
- ఆర్జేడీ మద్దతుదారులు తన కాన్వాయ్‌పై దాడి చేశారన్న బీహార్ ఉప ముఖ్యమంత్రి
- ఆర్జేడీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఆటవిక రాజ్యం వస్తుందని వ్యాఖ్య
- ఓ పోలింగ్ బూత్‌ను స్వాధీనం చేసుకోవడానికి ఆర్జేడీ కార్యకర్తలు ప్రయత్నించారని విమర్శ
బీహార్‌లో తొలి దశ పోలింగ్ కొనసాగుతుండగా, లఖిసరాయ్ నియోజకవర్గంలో తన కాన్వాయ్‌పై ఆర్జేడీ మద్దతుదారులు దాడి చేశారని బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా ఆరోపించారు. ఆర్జేడీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఆటవిక రాజ్యం తప్పదనడానికి ఈ ఘటనే నిదర్శనమని ఆయన అన్నారు.
తన కాన్వాయ్‌పై చెప్పులు, ఆవు పేడ విసిరారని, రాళ్లతోనూ దాడి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్జేడీ కార్యకర్తలు పోలింగ్ బూత్‌ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారని ఆయన పేర్కొన్నారు. దీనిపై ఫిర్యాదు చేసినప్పటికీ స్థానిక యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఉప ముఖ్యమంత్రి ఆరోపించారు. ఈ విషయంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని విజయ్ కుమార్ సిన్హా మీడియాతో చెప్పారు.
ఈ ఉదయం అదే నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్న విజయ్ సిన్హా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు, ఈ పరిణామంపై ఎన్నికల సంఘం స్పందించింది. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాష్ట్ర డీజీపీని ఆదేశించినట్లు ఈసీ అధికారులు వెల్లడించారు.