Anil Ambani: బ్యాంకు మోసం కేసు... అనిల్ అంబానీకి మరోసారి ఈడీ నోటీసులు

Anil Ambani Faces ED Notice Again in Bank Fraud Case
  • ఈ నెల 14న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ
  • ఎస్బీఐ నుంచి తీసుకున్న రుణాల ఎగవేత, నిధుల తరలింపుపై ప్రశ్నించనున్న ఈడీ
  • విచారణ కోసం తమ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్న ఈడీ
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. బ్యాంకు మోసం కేసు, మనీలాండరింగ్ ఆరోపణలపై ఆయనను వచ్చే వారం ఈడీ విచారించనుంది. ఈ మేరకు నవంబర్ 14న విచారణకు తమ కార్యాలయానికి హాజరు కావాలని ఈడీ ఆదేశించింది.

ఎస్బీఐ నుంచి తీసుకున్న రుణాల ఎగవేత, ఆ నిధుల తరలింపునకు సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ ప్రశ్నించనుంది.

రూ. 17 వేల కోట్ల రుణ మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అనిల్ అంబానీని ఈ ఏడాది ఆగస్టులో ఈడీ విచారించింది. అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు ఈ మొత్తాన్ని అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈడీ చర్యలు చేపట్టింది. మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలకు చెందిన రూ. 7,500 కోట్లను ఈడీ ఇటీవల జప్తు చేసింది.
Anil Ambani
Reliance Group
ED Investigation
Money Laundering Case
SBI Loans
Bank Fraud Case

More Telugu News