Rashmika Mandanna: హాట్ టాపిక్ గా మారిన 'ది గర్ల్ ఫ్రెండ్'

The Girl Friend Movie Update
  • ఈ నెల 7వ తేదీన 'ది గర్ల్ ఫ్రెండ్' 
  • ప్రధానమైన పాత్రలో రష్మిక 
  • యూత్ లో ఆసక్తిని పెంచిన ట్రైలర్
  • హిట్ ఖాయమంటూ వినిపిస్తున్న టాక్
   
ఇప్పుడు యూత్ అంతా ఒక సినిమా కోసం వెయిట్ చేస్తోంది .. ఆ సినిమా పేరే 'ది గర్ల్ ఫ్రెండ్'. ఇది యూత్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన సినిమా అనే విషయం టైటిల్ తోనే అర్థమైపోతుంది. లవ్ .. లవర్స్ .. రొమాన్స్ .. ఎమోషన్స్ ఈ జోనర్ కథల్లో సాధారణంగా కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఆ అంశాలు ఈ కథలో కాస్త ఘాటుగానే టచ్ చేశారనే విషయాన్ని ట్రైలర్ స్పష్టం చేసింది. ట్రైలర్ రిలీజ్ తరువాత ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 

 రష్మిక - దీక్షిత్ శెట్టి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ కాస్త గట్టిగానే ఉన్నాయనే విషయం ట్రైలర్ తరువాతనే యూత్ కి అర్థమైంది. దాంతో ఇప్పుడు ఈ సినిమా గురించే వాళ్లంతా మాట్లాడుకుంటున్నారు. తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లో రష్మిక జోరు ఒక రేంజ్ లో కొనసాగుతున్న సమయంలో, ఆమె నుంచి ఈ తరహా సినిమా ఒకటి వస్తుండటం విశేషంగా చెప్పుకుంటున్నారు. 

ఈ మధ్య కాలంలో ఈ స్థాయి స్టార్ హీరోయిన్ చేసిన రొమాంటిక్ మూవీ ఏదీ తెరపైకి రాలేదు. ఇక రష్మిక ఈ తరహా పాత్రను చేయడం కూడా ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. హేషమ్ అబ్దుల్ వాహెబ్ సమకూర్చిన సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలవడం ఖాయమనే టాక్ బలంగానే వినిపిస్తోంది. ఈ నెల 7వ తేదీన దాదాపు అరడజను సినిమాలు రిలీజ్ అవుతున్నా, 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీకే బజ్ ఎక్కువగా ఉంది. ఈ సినిమాతో రష్మిక మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి. 

Rashmika Mandanna
The Girlfriend Movie
Rashmika new movie
Rahul Ravindran
Dixith Shetty
Telugu movies 2024
Romantic Telugu cinema
Youth movies Telugu
Hesham Abdul Wahab music

More Telugu News