Akhilesh Yadav: ఆయన కోతుల మధ్య కూర్చుంటే గుర్తుపట్టలేం.. యూపీ సీఎంపై అఖిలేశ్ వ్యక్తిగత వ్యాఖ్యలు

Akhilesh Yadav Slams Yogi Adityanaths Remarks on RJD Congress SP
  • బీహార్ ఎన్నికల ప్రచారంలో నేతల వ్యక్తిగత దూషణలు
  • ‘అప్పు, పప్పు, తప్పు’ అంటూ తేజస్వీ, రాహుల్, అఖిలేశ్ లను ఉద్దేశించి యోగి వ్యాఖ్యలు
  • కౌంటర్ గా యూపీ సీఎంను కోతులతో పోల్చిన అఖిలేశ్ యాదవ్
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎన్డీయే, ఇండియా కూటముల తరఫున ఇతర రాష్ట్రాల కీలక నేతలు కూడా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బీహార్ లో ఎన్డీయే కూటమి తరఫున ప్రచారం చేస్తూ.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ లపై విరుచుకుపడుతున్నారు.

ముజఫరాపూర్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన ఈ ముగ్గురినీ ఎద్దేవా చేస్తూ.. ‘తేజస్వీని అప్పు అని, రాహుల్ ను పప్పు అని, అఖిలేశ్ ను తప్పు’ అంటూ సంబోధించారు. ‘‘గాంధీజీ చెప్పిన మూడు కోతుల గురించి మీకందరికీ తెలుసు. చెడు మాట్లాడకు, చెడు వినకు, చెడు చూడకు అని ఆ మూడు కోతులు చెబుతాయి. కానీ ప్రస్తుతం బీహార్ లో ఉన్న ఈ మూడు కోతులు అప్పు, పప్పు, తప్పు (తేజస్వీ, రాహుల్, అఖిలేశ్ లను ఉద్దేశించి) మాత్రం రాష్ట్ర ప్రజలకు అబద్ధాలు చెబుతూ మభ్యపెట్టి తిరిగి జంగిల్ రాజ్ పాలనను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాయి” అంటూ యోగి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దీనిపై అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. తాజాగా అఖిలేశ్ స్పందిస్తూ.. ఎన్డీయే కూటమిలోని బీజేపీ తరచుగా గాంధీజీ చెప్పిన మూడు కోతులను గుర్తుచేసుకుంటోందని, దీనికి ప్రధాన కారణం కీలక అంశాల పైనుంచి ప్రజలను డైవర్ట్ చేయడమేనని ఆరోపించారు. ‘‘నిజానికి ఆయన (యోగి ఆదిత్యనాథ్)ను కోతుల గుంపు మధ్య కూర్చోబెడితే నువ్వు కానీ, నేను కానీ గుర్తుపట్టలేం” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Akhilesh Yadav
Yogi Adityanath
Uttar Pradesh CM
Bihar Elections
Political Criticism
NDA Alliance
INDIA Alliance
Gandhi Three Monkeys

More Telugu News