Chandrababu Naidu: లండన్‌లో చంద్రబాబుతో భారత హైకమిషనర్ భేటీ

Chandrababu Naidu Discusses Education Ties with UK High Commissioner
  • లండన్ పర్యటనలో ఉన్న చంద్రబాబు
  • ఏపీ సీఎంను కలిసిన దురైస్వామి 
  • ఏపీ, యూకే యూనివర్శిటీల మధ్య భాగస్వామ్యంపై చర్చ
లండన్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో యూకేలో భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి సమావేశమయ్యారు. ఈ భేటీలో ఏపీ, యూకేల మధ్య విద్యా సంబంధాలను బలోపేతం చేయడంపై వీరు ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రపంచస్థాయి అవకాశాలు కల్పించే దిశగా ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా ఏపీతో యూకేలోని పలు ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు కలిసి పనిచేసే విషయంపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ముఖ్యంగా నాలుగు కీలక అంశాల్లో భాగస్వామ్యం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై వీరి మధ్య సంభాషణ జరిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేయడం ద్వారా విద్యా రంగంలో కొత్త అవకాశాలు సృష్టించడంపై దృష్టి సారించారు.

అలాగే, ఏపీ, యూకే వర్సిటీల మధ్య విద్యార్థుల మార్పిడి (స్టూడెంట్ ఎక్స్ఛేంజ్) కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా ఇరు ప్రాంతాల విద్యార్థులు విజ్ఞానాన్ని, సాంస్కృతిక అంశాలను పరస్పరం పంచుకునేలా చూడాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాల ద్వారా ఏపీ విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య, పరిశోధన అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ భేటీ ఏపీ, యూకే మధ్య విద్యా సంబంధాల్లో ఒక కీలక ముందడుగుగా భావిస్తున్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh
UK
Vikram Doraiswami
Indian High Commissioner
Education
Student Exchange Program
AP Universities
Joint Ventures

More Telugu News