తిరుమలలో అందరి దృష్టి ఆకర్షించిన 'ఏడడుగుల మహిళ'... వీడియో ఇదిగో!

  • తిరుమలలో ఏడడుగుల మహిళ సందడి
  • ఆమె శ్రీలంక మాజీ నెట్‌బాల్ క్రీడాకారిణి తర్జిని
  • వానమామలై జీయర్ స్వామి భక్త బృందంతో కలిసి శ్రీవారి దర్శనం
  • ఆమె ఎత్తు చూసి ఆశ్చర్యపోయిన భక్తులు
  • తర్జినితో ఫొటోలు దిగేందుకు ఎగబడిన జనం
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో సోమవారం ఉదయం ఓ ఆసక్తికర దృశ్యం చోటుచేసుకుంది. ఆలయ ప్రాంగణంలో ఏడు అడుగుల ఎత్తున్న ఓ మహిళ భక్తుల మధ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమెను చూసిన భక్తులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపించారు.

వివరాల్లోకి వెళితే, శ్రీలంకకు చెందిన మాజీ నెట్‌బాల్ క్రీడాకారిణి తర్జిని శివలింగం సోమవారం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. వానమామలై పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి నేతృత్వంలోని భక్త బృందంతో కలిసి ఆమె స్వామివారిని దర్శించుకున్నారు. ఏడు అడుగుల ఎత్తుతో ఉన్న ఆమెను ఆలయ పరిసరాల్లో చూసిన భక్తులు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు.

చాలామంది ఆమె వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకుంటూ, ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. దీంతో ఆలయ పరిసరాల్లో కాసేపు సందడి వాతావరణం నెలకొంది. 


More Telugu News