మహిళల వరల్డ్ కప్ ఫైనల్... టీమిండియాకు ఏపీ సర్కారు సపోర్ట్
- మహిళల వరల్డ్ కప్ ఫైనల్
- టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా
- ఏపీలోని వివిధ పట్టణాల కూడళ్లలో డిజిటల్ స్క్రీన్లు!
- టీమిండియాకు ఏపీ సర్కార్ మద్దతు
నవీ ముంబై వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు అద్భుతంగా రాణించింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. అనంతరం 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. తాజా సమాచారం అందేసరికి 24 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. భారత స్పిన్నర్ షఫాలీ వర్మ తన స్లో స్పిన్‌తో రెండు కీలక వికెట్లు పడగొట్టి సఫారీలను ఒత్తిడిలోకి నెట్టింది.
ప్రస్తుతం క్రీజులో దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ (65), సినాలో జాఫ్తా (2) ఉన్నారు. సఫారీ జట్టు విజయానికి ఇంకా 26 ఓవర్లలో 174 పరుగులు చేయాల్సి ఉండగా, వారి చేతిలో 6 వికెట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా మారింది.













