ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ.. ఎర్రన్నాయుడికి సీఎం చంద్రబాబు నివాళి
- ఆయన ఉన్నత విలువలకు ప్రతిరూపమన్న సీఎం
- ఉత్తమ పార్లమెంటేరియన్ గా నిలిచారని వ్యాఖ్య
- చివరి శ్వాస వరకూ బడుగుల అభివృద్ధికి పాటుపడ్డారన్న నారా లోకేశ్
మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ.. ఎర్రన్నాయుడు తన చివరి శ్వాస వరకూ బడుగుల అభివృద్ధి కోసమే పాటుపడ్డారని అన్నారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి పథంలో నడపడానికి ఆయన ఎంతగానో కృషి చేశారని తెలిపారు. ఎర్రన్నాయుడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.