Womens World Cup 2025: మహిళల ప్రపంచకప్ ఫైనల్‌కు వరుణుడి గండం.. మ్యాచ్ రద్దయితే విజేత ఎవరు?

Womens World Cup 2025 Final Rain Threat What Happens If Match is Cancelled
  • మహిళల ప్రపంచకప్ ఫైనల్లో భారత్, దక్షిణాఫ్రికా ఢీ
  • నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో తుది పోరు
  • ఫైనల్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. 63 శాతం ఛాన్స్
  • ఆట సాధ్యం కాకపోతే రిజర్వ్ డే అందుబాటులో
  • ఫలితం కోసం ఇరు జట్లు కనీసం 20 ఓవర్లు ఆడాల్సిందే
  • రిజర్వ్ డే కూడా రద్దయితే ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటన
మహిళల ప్రపంచకప్ 2025 ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో టైటిల్ కోసం భారత్, దక్షిణాఫ్రికా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఏడుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాను సెమీస్‌లో మట్టికరిపించి భారత్ ఫైనల్‌కు దూసుకొస్తే, మరో బలమైన జట్టు ఇంగ్లండ్‌పై గెలిచి దక్షిణాఫ్రికా తుది పోరుకు అర్హత సాధించింది. ఇరు జట్లు అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయమని అందరూ భావిస్తున్నారు.

అయితే, ఈ కీలక పోరుకు వరుణుడు అడ్డంకిగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రముఖ వాతావరణ సంస్థ అక్యూవెదర్ ప్రకారం, ఈరోజు నగరంలో 63 శాతం వర్షం పడే అవకాశం ఉంది. అలాగే 13 శాతం ఉరుములతో కూడిన జల్లులు పడొచ్చని అంచనా వేసింది. దీంతో మ్యాచ్‌కు పదేపదే అంతరాయం కలిగే అవకాశం ఉందని, ఆట సాఫీగా సాగడం కష్టమేనని తెలుస్తోంది.

వర్షం పడితే నిబంధనలు ఇవే
ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి? విజేతను ఎలా నిర్ణయిస్తారు? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇలాంటి పరిస్థితుల కోసం నిర్వాహకులు పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నారు. ముందుగా నిర్దేశిత రోజైన ఆదివారమే మ్యాచ్‌ను పూర్తి చేయడానికి అధికారులు అన్ని విధాలుగా ప్రయత్నిస్తారు. అవసరమైతే ఓవర్లను కుదించి అయినా ఫలితం తేల్చేందుకు చూస్తారు. నిబంధనల ప్రకారం, ఫలితం తేలాలంటే ఇరు జట్లు కనీసం 20 ఓవర్ల చొప్పున ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ ఆదివారం ఆట పూర్తిగా సాధ్యం కాకపోతే, నవంబర్ 3న (సోమవారం) రిజర్వ్ డేను ఏర్పాటు చేశారు.

అత్యంత అరుదైన సందర్భంలో, రిజర్వ్ డే రోజు కూడా వర్షం పడి, కనీసం 20 ఓవర్ల ఆట సాధ్యం కాకపోతే.. అప్పుడు ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. ఈ సందర్భంలో ట్రోఫీని భారత్, దక్షిణాఫ్రికా జట్లు పంచుకుంటాయి. దీంతో ఈసారి ఒక్క విజేత కాకుండా ఇద్దరు ఛాంపియన్లు ఉండే అవకాశం కూడా ఉంది.
Womens World Cup 2025
India Women
South Africa Women
Narendra Modi Stadium
Mumbai Weather
Cricket Rain Rules
ICC Tournament
Reserve Day
Joint Winners

More Telugu News