Kalvakuntla Kavitha: ఫోన్ ట్యాపింగ్ విషయంలో సంచలన ఆరోపణలు చేసిన కల్వకుంట్ల కవిత

Kalvakuntla Kavitha Alleges Phone Tapping During BRS Rule
  • తన భర్త ఫోన్ ట్యాప్ చేశారన్న కవిత
  • ఎవరైనా బావ ఫోన్ ట్యాప్ చేస్తారా అని ప్రశ్న
  • అవమానించినందు వల్లే పార్టీకి దూరమయ్యానని వెల్లడి
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తన భర్త ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని ఆమె ఆరోపించారు. సొంత బావ ఫోన్‌ను కూడా ట్యాప్ చేస్తారా అని ఆమె ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వార్తలు వినగానే తనకు ఏదోలా అనిపించేదని ఆమె అన్నారు.

'జాగృతి జనం బాట' కార్యక్రమంలో భాగంగా కరీంనగర్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్‌లో తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయం జరిగితే భరిస్తాను... కానీ అవమానాన్ని మాత్రం సహించబోనని అన్నారు. ఆత్మగౌరవం కోసమే తాను పార్టీతో విభేదించానని ఆమె పేర్కొన్నారు.

బీఆర్ఎస్ పార్టీలో చాలామంది అసంతృప్తితో ఉన్నారని కవిత అన్నారు. తాను పార్టీ నుంచి బయటకు వచ్చాక వారు తనకు టచ్‌లోకి వచ్చారని ఆమె వెల్లడించారు. 'జనం బాట'లో పాత బీఆర్ఎస్ కేడర్ తనతో మాట్లాడుతోందని చెప్పారు. తెలంగాణలో రాజకీయ శూన్యత ఉందని కవిత అభిప్రాయపడ్డారు.
Kalvakuntla Kavitha
BRS
Telangana Jagruthi
Phone Tapping
Telangana Politics
KCR
Karimnagar

More Telugu News