అమెరికా-భారత్ మధ్య కీలక రక్షణ ఒప్పందం
- ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం
- పదేళ్ల పాటు ఉండే ఒప్పందంపై సంతకం చేసిన ఇరుదేశాలు
- రాజ్నాథ్తో భేటీ కావడం సంతోషంగా ఉందన్న అమెరికా రక్షణ మంత్రి
ఈ సందర్భంగా హెగ్సెత్ సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' ద్వారా స్పందిస్తూ, పదేళ్ల రక్షణ ఒప్పందంపై సంతకం చేయడానికి రాజ్నాథ్ సింగ్తో సమావేశం కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇది ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళుతుందని ఆయన అన్నారు. సమన్వయం, సమాచారంతో పాటు సహకారాన్ని మరింతగా పెంచుకుంటామని, తమ రక్షణ సంబంధాలు మరింత బలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.