Nara Lokesh: కుంచనపల్లి కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ పునఃనిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన

Nara Lokesh Inaugurates Kunchanapalli Kasi Visweswara Swamy Temple Reconstruction
  • కుంచనపల్లిలో శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ పునఃనిర్మాణ పనులు ప్రారంభం
  • ముఖ్య అతిథిగా హాజరైన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్
  • వేదమంత్రాల నడుమ భూమిపూజ చేసి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి
  • ఆలయ పునఃనిర్మాణ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన నారా లోకేశ్
  • మంత్రికి బాణసంచాతో ఘనంగా స్వాగతం పలికిన గ్రామస్తులు
  • కార్యక్రమంలో పాల్గొన్న పలువురు కూటమి నాయకులు, అధికారులు
మంగళగిరి నియోజకవర్గం, తాడేపల్లి మండలం కుంచనపల్లిలో శ్రీ గంగా, శ్రీ అన్నపూర్ణాదేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయ పునఃనిర్మాణ పనులకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయనకు గ్రామస్థులు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు బాణసంచా మోతలు, పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య మంత్రి లోకేశ్ ఆలయ పునఃనిర్మాణ పనులకు భూమిపూజ నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులతో కలిసి శంకుస్థాపన చేసిన ఆయన, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత ధాన్యాదివాసంలో ఉన్న స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, గ్రామస్తులతో కలిసి ఫోటోలు దిగారు.

ఈ శంకుస్థాపన మహోత్సవంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావుతో పాటు పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Nara Lokesh
Kunchanapalli
Kasi Visweswara Swamy Temple
Temple Renovation
Tadepalli
Mangalagiri
Andhra Pradesh
APMSIDC
Nandam Abaddaiah
Tammisetti Janaki Devi

More Telugu News