మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే...

  • శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రమాణ స్వీకారం
  • రాజ్ భవన్‌లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
  • జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో మంత్రి పదవి
కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ రేపు మధ్యాహ్నం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రభుత్వంలో గ్రేటర్ పరిధిలో ఆయన తొలి మంత్రి కాబోతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12:15 గంటలకు రాజ్‌భవన్‌లో ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏఐసీసీ నుంచి ఆమోదం రావడంతో, రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తెలంగాణలో 18 మంది మంత్రులకు అవకాశం ఉండగా, ప్రస్తుతం 15 మంది ఉన్నారు. మరో ముగ్గురికి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్‌ను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కోదండరాంతో పాటు అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేసినప్పటికీ, గవర్నర్ ఆమోదించవలసి ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.


More Telugu News