'బారాముల్లా' .. ఓటీటీలో దడపుట్టించే హారర్ థ్రిల్లర్!

Baramulla Movie Update
  • ఉత్కంఠను రేపుతున్న 'బారాముల్లా' ట్రైలర్ 
  • కశ్మీర్ లోయల చుట్టూ దాగిన రహస్యం
  • ప్రధానమైన పాత్రలో మానవ్ కౌల్ 
  • హారర్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ 
  • నవంబర్ 7 నుంచి 'నెట్ ఫ్లిక్స్' లో  
       
'నెట్ ఫ్లిక్స్ ' నుంచి ఆడియన్స్ ను పలకరించడానికి ఇప్పుడు 'బారాముల్లా' సినిమా సిద్ధమవుతోంది. కశ్మీర్ లోని 'బారాముల్లా' అనే టౌనులో జరిగే కథ ఇది. ఆదిత్య సుహాస్ జంభాలే దర్శకత్వం వహించిన ఈ సినిమా, హారర్ థ్రిల్లర్ జోనర్లో నడుస్తుంది. మానవ్ కౌల్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా నుంచి ఈ రోజు వదిలిన ట్రైలర్ ఆసక్తికరంగా దూసుకుపోతోంది. ఈ సినిమాపై అందరిలోను కుతూహలాన్ని పెంచుతోంది. 

అందమైన కశ్మీర్ లోయలలో ఒక్కసారిగా అలజడి మొదలవుతుంది. 'బారాముల్లా' టౌన్ కి చెందిన పిల్లలు హఠాత్తుగా అదృశ్యమవుతూ ఉంటారు. అలా అదృశ్యమయ్యే పిల్లల సంఖ్య రోజురోజుకి పెరుగుతూ పోతుండటంతో అందరిలో ఆందోళన మొదలవుతుంది. ఈ మిస్సింగ్ కేసుల మిస్టరీని ఛేదించడానికి పోలీస్ ఆఫీసర్ రిద్వాన్ రంగంలోకి దిగుతాడు. తన సర్వీస్ లో ఎన్నో సమస్యలను పరిష్కరిస్తూ వచ్చిన ఆయనకి ఈ కేస్ సవాలు విసురుతుంది.

పిల్లలు ఎలాంటి పరిస్థితులలో అదృశ్యమయ్యారు? .. ఎక్కడ అదృశ్యమయ్యారు? ఈ కేసు విషయంలో అనుమానితులు ఎవరు? ఎటువైపు నుంచి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాలి? అనే విషయమై ఆయన ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి నిజాలు బయటపడతాయి? అతనికి ఎలాంటి అవరోధాలు ఎదురవుతాయి? వాటిని అతను ఎలా అధిగమిస్తాడు? అనేది కథ. నవంబర్ 7వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

Go Back to Shorts
Baramulla
Baramulla movie
Netflix
Kashmir horror thriller
Manav Kaul
Aditya Suhas Jambhale
horror thriller movie
OTT horror movie
Baramulla town
missing children case

More Telugu News