Vinayan: ఓటీటీలో భయపెడుతున్న మలయాళ హారర్ థ్రిల్లర్!

Thayyal Machine Movie Update
  • మలయాళ సినిమాగా 'తయ్యల్ మెషిన్'
  • ఆగస్టులో థియేటర్లకు వచ్చిన సినిమా 
  • ఈ నెల 17 నుంచి 'టెంట్ కొట్టా'లో స్ట్రీమింగ్
  • తెలుగులోను అందుబాటులోకి  
  • హారర్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ

థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కంటెంట్ ను ఉత్కంఠ భరితంగా అందించడంలో మలయాళ దర్శకులు పోటీ పడుతుంటారు. అందువలన మలయాళ థ్రిల్లర్ సినిమాలకి ఓటీటీలలో మంచి డిమాండ్ కనిపిస్తూ ఉంటుంది. అలా ఆగస్టు 1వ తేదీన థియేటర్లకు వచ్చిన సినిమానే 'తయ్యల్ మెషిన్'. వినయన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, థియేటర్స్ వైపు నుంచి ఆడియన్స్ ను గట్టిగానే భయపెట్టింది.

ఈ సినిమా ఈ నెల 17వ తేదీ నుంచి 'టెంట్ కొట్టా'లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. ఓటీటీ వైపు నుంచి కూడా ఈ సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోందని అంటున్నారు. కథ .. స్క్రీన్ ప్లే .. ఫొటోగ్రఫీ ..  నేపథ్య సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయనే టాక్ వినిపిస్తోంది. ఆత్మ ఆవహించిన ఒక 'కుట్టు మెషిన్' చుట్టూ తిరిగే కథ ఇది. గాయత్రీ సురేశ్ .. ప్రేమ్ నాయర్ .. శ్రుతి జయన్ ప్రధానమైన పాత్రలను పోషించారు.   
  
కథ విషయానికి వస్తే .. శివ ఒక పోలీస్ ఆఫీసర్. భార్య లీల .. కూతురుతో కలిసి అతను కొత్తగా ఒక ఇంటికి మారతాడు. అప్పటి నుంచి ఆ ఇంట్లో చిత్రమైన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అస్పష్టమైన ఆకారాలు కనిపిస్తూ ఉంటాయి. రాత్రివేళలో ఆ ఇంట్లోని ఒక పాత కుట్టు మెషిన్ దానంతట అది పనిచేస్తూ ఉంటుంది. అందుకు కారణం ఏమిటనేది కనుక్కోవడానికి శివ రంగంలోకి దిగుతాడు. అప్పుడు అతనికి తెలిసే నిజాలు ఏమిటి"  అనేది కథ. 


Vinayan
Malayalam horror thriller
Thiyyal Machine
Tent Kotta
OTT streaming
horror movie
Gayathri Suresh
Prem Nair
Shruthi Jayan

More Telugu News