మున్నేరు ఉగ్రరూపం.. నిలిచిన వాహనాల రాకపోకలు.. వీడియో ఇదిగో!
- పెనుగంచిప్రోలు వద్ద కాజ్ వే పైనుంచి ప్రవహిస్తున్న నది
- నీట మునిగిన బ్రిడ్జి.. వాహనాలను ఆపేసిన అధికారులు
- పెనుగంచిప్రోలు గ్రామ వాసులను అప్రమత్తం చేసిన రెవెన్యూ సిబ్బంది
భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో మున్నేరు నది ఉగ్రరూపం దాల్చింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు బ్రిడ్జి వద్ద ఉధ్దృతంగా ప్రవహిస్తోంది. వరదనీరు బ్రిడ్జిని ముంచెత్తింది. బ్రిడ్జి పైనుంచి వరద ప్రవహిస్తుండడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. వాహనాల రాకపోకలు నిలిపివేశారు. వరద ఉద్ధృతికి పెనుగంచిప్రోలు పరిసర ప్రాంతాల్లో పలు ఆలయాలు నీట మునిగాయి. గత రాత్రి నుండి ఇప్పటివరకు 15 అడుగులకు పైగా వరద నీరు పెరగడంతో పెనుగంచిప్రోలు గ్రామ వాసులను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు.