'బిగ్‌బాస్' షో సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్‌పై ప్రచారం.. స్పందించిన నిర్మాత
- సల్మాన్ ఖాన్ రూ. 200 కోట్ల వరకు తీసుకుంటున్నారని ప్రచారం
- సల్మాన్ ఖాన్ ఎంత తీసుకున్నప్పటికీ దానికి అర్హుడేనన్న నిర్మాత రిషీ నెగి
- సల్మాన్, జియో హాట్‌స్టార్‌ల మధ్య ఒప్పందం నేపథ్యంలో వివరాలు చెప్పలేనని వెల్లడి
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హిందీ 'బిగ్‌బాస్' రియాలిటీ షో పారితోషికం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సల్మాన్ ఖాన్ పారితోషికం రూ. 200 కోట్ల వరకు ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. సీజన్ 4 నుంచి ప్రస్తుతం ప్రసారమవుతున్న సీజన్ 19 వరకు ఆయనే వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆయన ప్రతి సీజన్‌కు రూ. 150 కోట్ల నుంచి రూ. 200 కోట్ల వరకు తీసుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ ప్రచారంపై రియాలిటీ షో నిర్మాత రిషీ నెగి స్పందించారు. రెమ్యునరేషన్ ఎంతైనా సల్మాన్ ఖాన్ దానికి అర్హుడేనని ఆయన అభిప్రాయపడ్డారు. సల్మాన్, ఓటీటీ సంస్థ జియో హాట్‌స్టార్‌ల మధ్య ఒప్పందం ఉందని, అందుకే ఆయన పారితోషికం గురించి తాను చెప్పలేనని అన్నారు. సల్మాన్ ఖాన్ ఈ షోతో ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారని, హోస్టింగ్ ఆపేస్తానని ఆయన పలు సీజన్లలో చెప్పినప్పటికీ, మళ్లీ ఆయనే చేస్తుండటం తమ అదృష్టమని రిషీ నెగి వ్యాఖ్యానించారు.