తిరుమల కొండల్లో కొత్త జీవి.. అరుదైన బల్లి జాతి గుర్తింపు
- కొత్త బల్లిజాతిని గుర్తించిన జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులు
- ‘వెంకటాద్రి స్లెండర్ గెక్కో’గా నామకరణం
- అంతర్జాతీయ జర్నల్ ‘హెర్పటోజోవా’లో ఆవిష్కరణ వివరాలు
ఈ కొత్త బల్లి జాతి పలుచగా, తొండను పోలి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. చందనపు చెట్టు బెరడు కింద నివసిస్తున్న సమయంలో దీనిని గుర్తించినట్లు వారు వివరించారు. ఈ ఆవిష్కరణకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ జర్నల్ ‘హెర్పటోజోవా’లో ప్రచురించారు.
ఈ కీలక పరిశోధనలో పలు సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు పాలుపంచుకున్నారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఫ్రెష్‌వాటర్ బయాలజీ రీజనల్ సెంటర్, కోల్‌కతాలోని రెప్లిల్లా విభాగం, ఒడిసాలోని ఫకీర్ మోహన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. శేషాచలం అడవుల జీవవైవిధ్యానికి ఈ కొత్త ఆవిష్కరణ మరో నిదర్శనమని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు.