Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గుడికి వెళ్లి తిరిగొస్తుంటే రోడ్డుపై దొరికిన డబ్బు సంచి.. లోపల 17.5 లక్షలు

Madurai Woman Selvamalini Returns Bag with Rs 17 Lakhs Fifty Thousand Found on Road
Advertisement
  • సంచీ నిండా రూ.500 నోట్లకట్టలే
  • తీసుకెళ్లి పోలీసులకు అప్పగించిన చెన్నై మహిళ
  • మహిళను అభినందించిన పోలీసులు
Advertisement
గుడిలో దేవుడిని దర్శించుకుని ఇంటికి తిరిగి వెళుతున్న ఓ మహిళకు రోడ్డుపై నోట్ల కట్టలతో ఉన్న బ్యాగు దొరికింది. బ్యాగు లోపల అన్నీ నోట్ల కట్టలే.. అదీ రూ.500 నోట్లే కనిపించాయి. ఇంకొకరైతే దేవుడే తనకీ అదృష్టం కల్పించాడని ఆ బ్యాగును ఇంటికి తీసుకెళ్లేవారే.. కానీ సెల్వమాలిని మాత్రం ఆ బ్యాగును తీసుకెళ్లి పోలీసులకు అప్పగించింది. ఆమె ముందే బ్యాగును తెరిచి నోట్ల కట్టలను లెక్కించిన పోలీసులు మొత్తం రూ.17.5 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించారు. బ్యాగులోని నోట్ల కట్టలను చూసి కూడా చలించకుండా తీసుకొచ్చి తమకు అప్పగించిన సెల్వమాలిని నిజాయతీని పోలీసులు అభినందించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురై సిమ్మక్కల్‌ ప్రాంతానికి చెందిన సెల్వమాలిని అనే మహిళ మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో ఆధ్యాత్మిక పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సెల్వమాలిని ఆలయం నుంచి ఇంటికి వెళుతుండగా రోడ్డుపై ఓ సంచీ కనిపించింది. రోడ్డు మధ్యలో ఉన్న ఆ సంచీని పక్కన పడేయాలనే ఉద్దేశంతో సెల్వమాలిని దగ్గరకు వెళ్లగా.. అందులో నోట్ల కట్టలు కనిపించాయి. దీంతో సమీపంలో భద్రతా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఆ సంచీని తీసుకెళ్లి అప్పగించింది. కాగా, ఆ నోట్ల కట్టల బ్యాగు ఎవరిది.. అక్కడ ఎందుకు ఉందనే వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.
Advertisement
Advertisement
Selvamalini
Madurai
Meenakshi Temple
Tamil Nadu
Lost Money
Honesty
Police
Rs 17.5 Lakhs
Roadside Find

More Telugu News