మాజీ మంత్రి హరీశ్ రావు ఇంట విషాదం

హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ కన్నుమూత
హైదరాబాద్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచిన సత్యనారాయణ
క్రిన్స్‌ విల్లాస్‌లో పార్థివదేహం
శోకసంద్రంలో హరీశ్ రావు కుటుంబ సభ్యులు
బీఆర్ఎస్ మాజీ మంత్రి,  సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ ఈరోజు వేకువజామున కన్నుమూశారు. ఆయన మృతితో హరీశ్ రావు కుటుంబంలో, బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.
 
సత్యనారాయణ పార్థివదేహాన్ని హైదరాబాద్‌లోని ఆయన నివాసమైన క్రిన్స్‌ విల్లాస్‌లో కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషుల సందర్శనార్థం ఉంచారు. ఈ విషయం తెలియగానే పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఇతర రాజకీయ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుని సత్యనారాయణ భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు. హరీశ్ రావును, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.


More Telugu News

Harish Rao Harish Rao father Tanneeru Satyanarayana BRS party Siddipet MLA Telangana politics Obituary Condolences