Revanth Reddy: రేపు 'సినీ కార్మికుల' అభినందన సభ.. హాజరుకానున్న రేవంత్ రెడ్డి

Revanth Reddy to Attend Cine Karmikula Sabha Tomorrow
  • సాయంత్రం నాలుగు గంటలకు 'సినీ కార్మికుల' అభినందన సభ
  • యూసుఫ్‌గూడ పోలీస్ మైదానంలో జరగనున్న సభ
  • కార్యక్రమానికి హాజరు కానున్న సినీ పెద్దలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు యూసుఫ్‌గూడలో సినీ కార్మికుల అభినందన సభలో పాల్గొననున్నారు. ఈ సభ రేపు సాయంత్రం నాలుగు గంటలకు యూసుఫ్‌గూడ పోలీస్ మైదానంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.

ఇదిలా ఉండగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రచార షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 31 నుంచి నవంబర్ 9వ తేదీ వరకు ఆయన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించనున్నారు.

షెడ్యూల్ ప్రకారం ఈ నెల 31న సాయంత్రం 7 గంటలకు వెంగళరావునగర్, సాయంత్రం 8 గంటలకు సోమాజిగూడలో రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తారు.

నవంబర్ 1న సాయంత్రం 7 గంటలకు బోరబండ, సాయంత్రం 8 గంటలకు ఎర్రగడ్డలో ప్రచారం ఉంటుంది. నవంబర్ 4న సాయంత్రం 7 గంటలకు షేక్‌పేట, సాయంత్రం 8 గంటలకు రహమత్ నగర్‌లో ప్రచార కార్యక్రమాలు జరుగుతాయి.

నవంబర్ 5న సాయంత్రం 7 గంటలకు షేక్‌పేట, సాయంత్రం 8 గంటలకు యూసుఫ్‌గూడలో రేవంత్ రెడ్డి ప్రచారం చేయనున్నారు.

నవంబర్ 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల మధ్య 6 డివిజన్‌లలో మోటార్ సైకిల్ ర్యాలీ, నవంబర్ 9న ఉదయం 10 గంటలకు షేక్‌పేటలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారు.
Revanth Reddy
Telangana CM
Cine Karmikula Sabha
Yousufguda
Jubilee Hills Election
Telangana Politics

More Telugu News