Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇంట శుభకార్యంలో ప్రముఖుల సందడి
- ఢిల్లీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కుమారుడి బారసాల, నామకరణోత్సవ వేడుక
- శివాన్ ఎర్రన్నాయుడుగా నామకరణం
- చిన్నారికి ఆశీస్సులు అందజేసిన సుప్రీంకోర్టు సీజే జస్టిస్ గవాయ్, పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రముఖులు
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుమారుడి బారసాల, నామకరణోత్సవం ఢిల్లీలో నిన్న అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి ప్రముఖులు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. రామ్మోహన్ నాయుడు తన కుమారుడికి 'శివాన్ ఎర్రన్నాయుడు' అని నామకరణం చేశారు. తన తండ్రి, దివంగత నేత ఎర్రన్నాయుడు పేరు వచ్చేలా పేరు పెట్టారు.
ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, మనోహర్‌లాల్ ఖట్టర్, హర్‌దీప్‌సింగ్ పూరి, ప్రహ్లాద్ జోషి, కిరణ్ రిజిజు, జ్యోతిరాదిత్య సింధియా, అశ్వినీ వైష్ణవ్, భూపతిరాజు శ్రీనివాసవర్మ హాజరయ్యారు.
అలాగే, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీజేఐ జస్టిస్ నూతలపాటి వెంకట రమణ, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్త, ఉత్తర్‌ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈ వేడుకలో పాలుపంచుకున్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, సంధ్యారాణి, కొల్లు రవీంద్ర, బీసీ జనార్దన్‌రెడ్డి, టీజీ భరత్ కూడా హాజరయ్యారు.
వీరితో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, రామ్మోహన్ నాయుడి మామ, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ ప్రముఖులు పాల్గొని రామ్మోహన్ నాయుడు దంపతులకు శుభాకాంక్షలు తెలిపి, చిన్నారిని ఆశీర్వదించారు.