Harvard University: హార్వర్డ్ యూనివర్శిటీ సమీపంలో కాల్పుల కలకలం

Harvard University Students Warned After Shooting Near Campus
  • క్యాంపస్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి కాల్పులు
  • సైకిల్‌పై వచ్చి మరో వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్న దుండగుడు
  • ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదన్న పోలీసులు
  • ఎవరూ బయటకు రావొద్దంటూ వర్సిటీ హెచ్చరికల జారీ
  • నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు
అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం క్యాంపస్ సమీపంలో గుర్తుతెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని స్థానిక పోలీసులు స్పష్టం చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం సాయంత్రం షెర్మాన్ స్ట్రీట్‌లోని డానేహా పార్క్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రదేశం హార్వర్డ్‌లోని రాడ్‌క్లిఫ్‌ క్వాడ్‌కు దగ్గరగా ఉంది. సైకిల్‌పై వచ్చిన ఓ వ్యక్తి, మరో వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపినట్లు ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

కాల్పుల నేపథ్యంలో యూనివర్సిటీ యాజమాన్యం తక్షణమే అప్రమత్తమైంది. క్యాంపస్‌లోని విద్యార్థులు, సిబ్బంది ఎవరూ బయటకు రావొద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే తమకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Harvard University
Harvard University shooting
Harvard
Cambridge Massachusetts
Radcliffe Quad
Sherman Street
Danehy Park
US shootings

More Telugu News