Arvind Srinivas: ఆ రెండు తప్ప, గూగుల్ ఎకోసిస్టం ఉత్పత్తులు అసాధ్యమేమీ కాదు: పర్‌ఫ్లెక్సిటీ సీఈవో అరవింద్ శ్రీనివాస్

Arvind Srinivas says Google products are not impossible to recreate
  • గూగుల్ ఎకోసిస్టంను ఏ స్టార్టప్ కూడా ఓడించలేదన్న నెటిజన్
  • స్పందించిన అరవింద్ శ్రీనివాస్
  • గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్‌ను దాటడం అత్యంత కష్టం, అసాధ్యమని వెల్లడి
  • మిగతా ఉత్పత్తులు కష్టమైనా అసాధ్యమేమీ కాదన్న అరవింద్ శ్రీనివాస్
గూగుల్ ఎకోసిస్టంలోని పలు ఉత్పత్తులను మళ్లీ క్రియేట్ చేయడం కష్టమే అయినప్పటికీ, అసాధ్యం కాదని ఏఐ ఆధారిత సెర్చింజన్ 'పర్‌ఫ్లెక్సిటీ' సీఈవో అరవింద్ శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. అయితే, గూగుల్ మ్యాప్స్, యూట్యూబ్‌లను అధిగమించడం మాత్రం అత్యంత కష్టమని, అది అసాధ్యం కూడా కావచ్చని ఆయన పేర్కొన్నారు.

మిగిలిన గూగుల్ ఉత్పత్తులు కష్టమైనప్పటికీ అసాధ్యం కాదని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా ఒక పోస్ట్ చేశారు. గూగుల్ ఉత్పత్తులను ఉద్దేశించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గూగుల్ ఎకోసిస్టంలోని యాప్స్ జాబితాను ఒక యూజర్ పోస్ట్ చేస్తూ, ఏ స్టార్టప్ కూడా వీటిని ఓడించలేదని పేర్కొన్నాడు.

దీనికి సమాధానంగా అరవింద్ శ్రీనివాస్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొంతమంది గూగుల్ ఎకోసిస్టంను ఎందుకు భర్తీ చేయలేమో వివరిస్తే, మరికొందరు భవిష్యత్ టెక్ మార్పులపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
Arvind Srinivas
Perplexity AI
Google Ecosystem
Google Maps
YouTube
AI Search Engine
Tech Startups

More Telugu News